హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పంచాశ దనిలే/
దివిద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగమ్//
ఓ భవానీ!మాతా!తల్లీ!అమ్మా!దేవీ!అన్ని చక్రాలకు ఉపరిగా సహస్రార చక్ర మధ్యం లో సహస్రదళ పద్మంగా నీవు విరాజిల్లుతావు.నీ నుండి ప్రసరించే శక్తిసంజనితమైన తేజోకిరణాలు యాభై ఆరు,మూలాధార కేంద్రంలో పృథ్విగా పరివర్తనం చెందుతాయి.మణిపురంలో ఏభై రెండు జలతత్త్వంగా,స్వాధిష్ఠానంలో అరవై రెండు అగ్నితత్త్వంగా, అనాహతంలో ఏభై నాలుగు వాయు తత్త్వంగా,విశుద్ధ చక్రంలో డెబ్బై రెండు ఆకాశ తత్త్వంగా, ఆజ్ఞాచక్రంలో అరవై నాలుగు మనస్సుగా పరిణమిస్తాయి.
No comments:
Post a Comment