Friday, 31 July 2026

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా అను అద్భుతమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలోని డెబ్బై మూడవ నామముగా చెప్పబడినది.అమ్మవారికి పదహేను మంది నిత్యా దేవతలు,అదే తిథి దేవతలు ఉన్నారు కదా.వారందరూ భండాసుర సంహారనికి ఉద్యమించారు వసతమ తమ శక్తి సేనలతో.అట్టి వారి పరాక్రమా పాటవాలను వీక్షించుచున్నది మన అమ్మవారు.వారి శక్తి యుక్తులు చూసి మురిసిపోతున్నది.మనసు నందు సంతోషం ఉత్తేజితమవుతున్నది.అమ్మవారి సైన్యంలో జ్వాలామాలిని,వహ్వివాసినీ ఉన్నారు కదా!వారు నిత్యమూ ప్రకాశిస్తూ ఉంటారు.రాక్షసి మూకలు రాత్రుళ్ళు విజృంభిస్తారు కదా!కానీ అమ్మవారి సైన్యాలు ఆ తీకటిలో కూడా వారిని గుర్తించి,చీకటిని కడిగేసినట్లు శుభ్రం చేసేస్తారు.వాళ్ళను నామరూపాలు లేకుండా చేస్తారు. భండాసురుని సేనాపతులు పదహేను మంది.వారు...దమనక,దీర్ఘజిహ్వ,హబక,హలుమల్ల,కక్లన,కల్లివాహన,ధుక్లన,పుత్రకేతు,చంద్రబాహు,కుక్కుర,జంబుకాక్ష,కుంభగ,తీక్షశృంగ,త్రికంటక మరియు చంద్రగుప్త. వీరినందరినీ మన నిత్యా దేవతలు సంహరించేటప్పుడు చూపిన పరాక్రమాటోపానికి మన అమ్మవారు మహదానందభరితురాలు అయింది.కాబట్టి ఆ తల్లికి ఈ పేరు సముచితంగా ఉన్నది.

No comments:

Post a Comment