Tuesday, 7 July 2026

కామదాయినీ

కామదాయినీ అను అద్భుత నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన అరవై మూడవ నామము.ఆ తల్లి భక్తుల అభీష్టములను సిద్ధింప చేస్తుంది. కాబట్టి ఈ పేరు సరిగ్గా అతికినట్లు ఉంది.అమ్మ మనందరి భౌతికపరమయిన సుఖాలు,కోర్కెలే కాకుండా ఆధ్యాత్మికమయిన ఆనందము,తృప్తిని కూడా కలుగచేస్తుంది. కామములకు ఈశ్వరుడు పరమేశ్వరుడు.దాయని అనగా ఇచ్చునది అని అర్థము.అంటే ఆ మహాతల్లి కామేశ్వరుని అనుగ్రహము,కృపా కటాక్షము భక్తకోటికి వెదజల్లుతుంది.ఆమె ధర్మబద్ధంగా కోరికలు తీరుస్తుంది.గొంతెమ్మ కోర్కెలు కాదు.కాబట్టి కోర్కెలు కూడా మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని కోరాలి.

1 comment: