Thursday, 9 July 2026
దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవీ
దేవగణ సంఘాత్మ స్తీయమానైత్మ వైభవీ అను అద్భుత నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు అరవై నాలుగవ నామముగా చెప్పారు.అమ్మ అంటే జగన్మాత కదా!కాబట్టి ఆ తల్లిని అందరూ కొలుచుకుంటారు.అది స్వాభావికము.దేవతలు,ఋషులు,దేవగణాలు,వారి సమూహాలు...అందరు కూడా ఆ తల్లిని ప్రస్తుతిస్తూనే ఉంటారు.అది వారికి ఎడతెగని కార్యక్రమము.అంత నిష్ట,నిబద్ధలతో చేస్తారు.అమ్మవారు ఆ వైభోగం,వైభవంతో విరాజిల్లుతూ ఉంటుంది సర్వదా.
నవ గణ దేవతలు వీరే...ఆదిత్యులు...12
విశ్వ దేవతలు..10
వసువులు...8
తుషితులు...36
అభాస్వరులు..64
అనిలులు...49
మహారాజికులు..220
సాధ్యులు...12
మరియు రుద్రులు...11.
అచ్చులు పదహారు మరియు హల్లులు ముప్పై నాలుగు.ఇక్కడ అచ్చులు దేవతలు,హల్లులు ఋషిగణములు,క్షకారముతో కలసి ఏభై ఒక్క వర్ణములు అనగా అక్షరములు.ఈ వర్ణములతోనే వేదశాస్త్రాలు ఏర్పడినాయి.
భండాసురుడు దేవతలను ఓడించాడు.అతని సంఘాతము,అనగా నరకము నుంచి కాపాడమని దేవగణమంతా ముక్త కంఠంతో అమ్మవారిని స్తుతిస్తున్నారట!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment