Wednesday, 22 July 2026

గేయ చక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితా

గేయ చక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితా అను సుందరమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో అరవై తొమ్మిదవ నామముగా చెప్పబడినది.అమ్మవారు జగన్మాత!అతి భయంకరుడైన భండాసురుడి పైకి యుద్ధానికి నడుము బిగించింది.మరి ఆమె మంత్రిణులు ఎలా ఉండాలి?అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు.అందులో శ్యామలా దేవి అత్యంత సన్నిహితురాలు.శ్యామలా దేవి రథము పేరు గేయచక్రము.శ్యామలా దేవి గేయచక్రము అనే తన రథమును అథిరోహించి,అమ్మవారి సేవలో నియతం తరిస్తుంది.ఈమెను రాజశ్యామలా దేవి అని కూడా అంటారు.ఆమె అథిరోహించిన రథానికి ఏడు పర్వములు ఉంటాయి.ఇక్కడ పర్వము అంటే ఆవరణ అని అర్థము.ఈ ఏడు ఆవరణలలో వివిథ రకాల దేవతలు ఉంటారు. శ్రీ చక్రము లోని త్రికోణమే గేయచక్రము.ఈ త్రికోణానికి అథిష్ఠాన దేవత అయిన త్రిపురాంబయే శ్యామలా దేవి.ఇంకో రకంగా చెప్పుకోవాలంటే గేయ చక్రమే సూర్య మండలము.సూర్య లోకం పొందిన యోగినులు దేవిని ధ్యానించి,పరలోకం చేరుతారు. అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు అనుకున్నాము కదా!వారు...సంగీత యోగిని,శ్యామా,శ్యామలా,మంత్రనాయకా,మంత్రిణీ,సచివేశానీ,ప్రధానేశా,కుశప్రియ,వీణావతీ,వైణికీ,మంద్రిణీ,ప్రియకప్రియా,నీపప్రియా,కదంబవేశ్యా,కదంబ వనవాసినీ మరియు సదామలా.

No comments:

Post a Comment