Wednesday, 29 July 2026

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా అను అతి సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఒకటవ నామముగా చెప్పబడినది. అగ్ని దేవుని పుత్రిక జ్వాలామాలిని.ఆమె శుక్లపక్ష చతుర్దశీ తిథి దేవత.ఆమె చేత వెలిగింపబడిన వహ్ని ప్రాకారము మధ్యలో మన అమ్మవారు ప్రకాశిస్తూ,ఆసీనురాలై ఉంటుంది.ఆమె తిథులకు సంబంధించిన నిత్యా దేవతలలో శుద్ధ చతుర్దశీ తిథికీ మరియు కృష్ణ పక్ష విదియ తిథికీ చెందినది. నిత్యా దేవతలు పదహారు మంది.చంద్రుని కళలు పదహారు.పదిహేను తిథులకు పదిహేను నిత్యలు ఉన్నారు.పదహారవ కళ మహానిత్య.ఆమె పరమేశ్వరి. వారు.. తిథి........శుక్ల పక్షము....కృష్ణ పక్షము... పాడ్యమి......కామేశ్వరి.....చిత్రా, విదియ....భగమాలిని.....।।।జ్వాలా మాలిని, తదియ...।।నిత్య క్లిన్నా.।।।।।....సర్వ మంగళా, చవితి......భేరుండా........విజయా, పంచమి....వహ్నివాసినీ...నీలపతాకా, షష్టి......మహా వజ్రేశ్వరీ......నిత్యా, సప్తమి....శివదూతీ...కుల సుందరీ, అష్టమి...త్వరతా....త్వరితా, నవమి...।।।కుల సుందరీ....శివదూతీ, దశమి....నిత్యా.....మహా వజ్రేశ్వరి, ఏకాదశి...నీలపతాకా...వహ్నివాసిని, ద్వాదశి....।విజయ....।।భేరుండా, త్రయోదశి.....సర్వ మంగళా...నిత్యక్లిన్నా, చతుర్దశి....జ్వాలామాలిని...భగమాలిని మరియు పూర్ణిమ...చిత్రా..........కామేశ్వరి. జ్వాలామాలిని అగ్ని స్వరూపురాలు.తాకితే భస్మమయిపోవడమే,దాటిపోయే ప్రసక్తే లేదు.అందుకే అమ్మవారు భండాసురుడి పైన యుద్ధానికి పోయేటప్పుడు తన సైన్యానికి చుట్టూ వహ్ని ప్రాకారంగా విస్తరించమని జ్వాలామాలినిని ఆదేశించింది. ఇంక ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పుకుందాము.శ్రీచక్రంలో శక్తి సంజ్ఞ కలవి ఐదు చక్రాలు,అగ్ని సంజ్ఞ కలవి నాలుగు చక్రాలు ఉంటాయి.ఈ త్రికోణముల కలయికతో ఏర్పడినదే వహ్నిప్రాకారము.మధ్యలో ఉన్న బిందువే పరమేశ్వరి అయిన మన అమ్మ.

1 comment: