Thursday, 8 May 2025
శ్రీ రామాష్టకమ్
సుగ్రీవమిత్రం పరమం పవిత్రం,సీతాకళత్రం నవమేఘగాత్రమ్।
కారుణ్య పాత్రం శతపత్రనేత్రం,శ్రీరామచంద్రం సతతం నమామి॥1॥
సంసారసారం నిగమప్రచారం,ధర్మావతారం హృతభూమి భారమ్।
సదాఽవికారం సుఖసింధుసారం,శ్రీరామచంద్రం సతతం నమామి॥2॥
లక్ష్మీనివాసం జగతాం నివాసం,లంకావినాశం భువనప్రకాశమ్।
భూదేవవాసం శరదిందు హాసం,శ్రీరామచంద్రం సతతం నమామి॥3॥
మందారమాలం వచనేరసాలం,గుణైర్విశాలం హతసప్తతాలమ్।
క్రవ్యాదకాలం సురలోకపాలం,శ్రీరామచంద్రం సతతం నమామి॥4॥
వేదాంతగానం సకలైస్సమానం,హృతారిమానం త్రిదశప్రధానమ్।
గజేంద్రయానం విగతావసానం,శ్రీరామచంద్రం సతతం నమామి॥5॥
శ్యామాభిరామం నయనాభిరామం,గుణాభిరామం వచనాభిరామమ్।
విశ్వప్రణామం కృతభక్తకామం,శ్రీరామచంద్రం సతతం నమామి॥6॥
లీలా శరీరం రణరంగధీరం,విశ్వైకసారం రఘువంశహారమ్।
గంభీరనాదం జితసర్వవాదం,శ్రీరామచంద్రం సతతం నమామి॥7॥
ఖలేకృతాంతం స్వజనే వినీతం,సామోపగీతం మనసా ప్రతీతమ్।
రాగేణగీతం వచనాదతీతం,శ్రీరామచంద్రం సతతం నమామి॥8॥
శ్రీరామచంద్రస్య వరాష్టకం త్వాం,మయేరితం దేవి!మనో విశుద్థయే।
పఠంతి శృణ్వంతి గృణంతి భక్త్యా,తేస్వీయకామాన్ ప్రలభంతి నిత్యమ్॥9॥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment