Monday, 10 August 2026

మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా

మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా అను సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలోని డెబ్బై ఎనిమదవ నామముగా పేర్కొనబడినది.విశుక్రుడు ప్రతిష్టించిన జయ విఘ్న యంత్రమును ఛేదించి,భేదించడానికి అమ్మవారు కామేశుని క్రీగంట,నగుమోముతో చూడగానే,తక్షణమే మహాగణేశుడు అమ్మ ఒడిలో ఆవిర్భవించాడు కదా!ఆవిర్భావం కాగానే తనలాంటి ఆరుగురు గణపతులను సృష్టించాడు.వారందరూ కలసి విశుక్రుడు ప్రతిష్టించిన జయవిఘ్నము అనే యంత్రము,దాని ఎనిమిది కోణములు,ప్రతి కోణమునకు శూలములు,ఆ శూలముల పైన విశుక్రుడు ఆవహింపచేసిన క్షుద్ర దేవతలు...అన్నింటినీ మట్టుబెట్టి,సమూలంగా నాశనం చేసారు.వారి ప్రతాపాలు,పాటవాలు,ఆ సామూహిక ప్రక్రియ చూసి అమ్మవారు మహదానందపడిపోయింది. మహాగణేశుడు ఆవిర్భవింపచేసిన ఆరుగురు గణపతులు...ఆమోద,ప్రమోద,సుముఖ,దుర్ముఖి,అవిఘ్న మరియు విఘ్నకర్త. విఘ్న నాశనం చేసేవాడు కాబట్టే మనం హరిద్రా గణపతి,అదే పసుపుతో గణేశుని చేసి,ప్రతిష్టించుకుని,ప్రతి పూజకూ ముందు విఘ్న నాయకుడికి పూజ చేస్తాము.

No comments:

Post a Comment