Friday, 30 January 2026
రాగస్వరూప పాశాఢ్యా
రాగస్వరూప పాశాఢ్యా అనేది శ్రీలలితా సహస్ర నామావళి లోని ఎనిమిదవ నామము.
రాగము అంటే అనురాగము అని అర్థము.స్వరూప అంటే స్వరూపము కలది అని.పాశాము అంటే బంధము లేక ఉచ్చు అని అర్థము.
ఆ తల్లికి నాలుగు బాహువులు ఉన్నాయి అని చెప్పుకున్నాము కదా!ఆమెకు ఎడమ వైపు గల క్రింది చేతిలో పాశము ధరించి ఉంటుంది.అది అనురాగమనే పాశము.
ఆ పాశముతో ఆమె తన భక్తులు తప్పు మార్గంలో పోకుండా కాపాడుకుంటుంది.కామ,క్రోధ,మద,లోభాలకు ఉచ్చు బిగిస్తుంది.మానవుడు సరైన మార్గంలో పయనించేదానికి,ఆ అనురాగ స్వరూప పాశం ఉపయోగిస్తుంది.
మంచికి చెడ్డకు,ప్రేమకు మోహానికి మనంగీత గీసుకోవాలి.లేకపోతే దారి తప్పిపోవడం చాలా సులువు.క్షణం పట్టదు మనసు నిగ్రహించుకోలేక పోతే!
అనురాగము అనేది వాసనాత్మకము.పాశం అనేది స్థూల రూపం.ఒకరకంగా బంధం అంటే ప్రతిబంథకమే!అది విడిపించుకుంటేగానీ మోక్షం దక్కదు.
Subscribe to:
Post Comments (Atom)
🙏👌
ReplyDelete