Monday, 26 January 2026
ఉద్యద్భాను సహస్రాభా
ఉద్యద్భాను సహస్రాభా అనునది శ్రీలలితా సహస్రనామావళిలోని ఆరవ నామము.మనము సూర్య చంద్రులు మనకు వెలుగునిస్తున్నాయి అనుకుంటాము.కానీ నిజానికి ఆ తల్లి తేజముతోటే అవి వెలుగుతున్నాయి.
ఇక్కడ అమ్మవారు ఉదయించుచున్న భానుని యొక్క సహస్ర కిరణముల సమానమైన కాంతులతో విరాజిల్లుతున్నది అని అర్థము.ఇక్కడ సహస్రము అంటే లెక్కగా వెయ్యి అని కాదు.లెక్కలేనన్ని అని,అనంతము అని అర్థము.
తల్లి త్రికోణరూపిణి,శివుడు బిందురూపము.అమ్మ వ్యక్తము,అయ్య అవ్యక్తము.
దేవీ భాగవతములోని కథ.తారకాసురుడు అనే రాక్షసుని బాధలు పడలేక దేవతలు పరమేశ్వరిని ప్రార్థిస్తారు.చైత్ర శుద్థ నవమి నాడు కాంతి పుంజములాగ,కోటి సూర్య ప్రభలతో,మెరుపుతీగలాగా సాక్షాత్కారము అవుతుంది.దేవతలు అంత కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు.అప్పుడు అపురూప లావణ్యంతో కనిపిస్తుంది.అప్పుడు వారందరూ ఉద్యద్భాను సహస్రాభా అని కీర్తిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment