తిరస్కుర్వ న్నేతత్స్వమపి వపురీశ స్తిరయతి/
సదాపూర్వ స్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః
తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్ర్భూ లతికయోః//
ఓ మాతా!తల్లీ!భగవతీ!అమ్మా!సృష్టికి కర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు.మహావిష్ణువు ఏమో రక్షిస్తున్నాడు.రుద్రుడు ఏమో విశ్వాన్ని లయింప చేస్తున్నాడు.కల్పాంతం లో మహేశ్వరుడు ఈ బ్రహ్మ,విష్ణువు,రుద్రులను తనలో లీనం చేసుకొని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు.ఈ ప్రకారంగా ఈ బ్రహ్మాండం అంతా లయమయిపోతుంది.మళ్ళీ ఆ సదాశివుడు కల్పాదిలో నీవు నీ కనుబొమ్మలను ఒక్క క్షణం కదిలించగానే,అదే ఆజ్ఞగా గ్రహించి ఈ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు.
No comments:
Post a Comment