శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి/
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి//1//
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి/
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి//1//
- అమ్మా!తల్లీ!ఓ భగవతీ!సర్వ మంగళకారుడైన,సర్వ మంగళ సహితుడైన శివుడు జగన్నిర్మాణ శక్తివి అయిన నీతో కూడినప్పుడే ఈ జగత్తులన్నింటినీ సృష్టించేదానికి సమర్థుడు అవుతాడు.లేకపోతే కాడు.నీతో కలవలేకపోతే,కూడకపోతే ఆ దేవ దేవుడు తనకు తాను కదలటానికి కూడా అశక్తుడు అవుతాడు.అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేత పూజింప దగ్గ దానివి అయిన నిన్ను మ్రొక్కటానికి గాని,స్తుతించటానికి గాని మేము పూర్వ జన్మలో పుణ్యం చేసుకొని వుండాలి.అలా పుణ్యం చేయని వ్యక్తులకు నిన్ను పూజించే సమర్థత ఎక్కడి నుంచి వస్తుంది?తప్పకుండా రాదు.
No comments:
Post a Comment