జయ విఘ్నేశ్వర!నమో నమో,జగద్రక్షకా!నమోనమో,
జయకర !శుభకర!సర్వపరాత్పర!జగదుద్థారా!నమోనమో॥
మూషికవాహన!నమోనమో,మునిజనవందిత!నమోనమో,
మాయారాక్షసమదాపహరణా!మన్మథారిసుత!నమోనమో॥జయ॥
విద్యాదాయక!నమోనమో,విఘ్నవిదారక!నమోనమో,
విశ్వసృష్టిలయకారణ శంభో!విమలచరిత్రా!నమోనమో॥జయ॥
గౌరీప్రియసుత!నమోనమో,గంగానందన!నమోనమో,
గంధర్వాద్భుతగైనవినోదా!గణపతిదేవా!నమోనమో॥జయ॥
నిత్యానందా!నమోనమో,నిజఫలదాయక!నమోనమో,
నిర్మలపురవర!నిత్యమహోత్సవ!రామనాథనుత!నమోనమో॥జయ॥
No comments:
Post a Comment