Sunday, 20 October 2024

ఏక శ్లోక రామాయణము

అదౌరామ తపోవనాది గమనం-హత్వా మృగం కాంచనం వైదేహీహరణం-జటాయు మరణం-సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం-సముద్రతరణం-లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం యేతద్వి రామాయణమ్॥ రామాయణం అనేది మనకు చాలా ముఖ్యమయిన,పవిత్రమయిన గ్రంథం.అంత పెద్ద చరిత్రని ఒక చిన్న శ్లోకంతో సరిపుచ్చేసాడు కవి.ఈ శ్లోకం యొక్క సారాంశం చెప్పుకుందాము.రాముడు అడవులకు వెళ్ళాడు.బంగారు జింకను చూశాడు.వైదేహి అపహరింబడింది.జటాయువు అనే పక్షిరాజము మరణించింది.సుగ్రీవుడితో సంభాషణలు,స్నేహాలు జరిగాయి.వాలిని అంతమొందించారు.సముద్రం దాటారు.లంకాపురిని అగ్నికి ఆహుతి చేసారు.ఆ తరువాత రావణుడిని,కుంభకర్ణుడిని చంపారు.టూకీగా రామాయణంలో జరిగింది ఇదే!

No comments:

Post a Comment